థానే: మహారాష్ట్ర(Maharastra)లోని థానే జిల్లాకు చెందిన ప్రత్యేక కోర్టు … అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. 2021లో పక్కింటికి చెందిన 13 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి రేప్ చేశాడు. కల్వా ప్రాంతానికి చెందిన అతనికి ఐపీసీ చట్టంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో స్పెషల్ జడ్జి డీఎస్ దేశ్ముక్ తీర్పు ఇచ్చారు. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 20 వేల జరిమానా కూడా విధించారు.
2021, ఆగస్టు 17వ తేదీన ఓ బాలిక ఇంటి బయట ఆడుకుంటోందని, ఆ పాపను నిందితుడు తన ఇంట్లోకి తీసుకెళ్లి, బెదిరించి, రేప్‌కు పాల్పడినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేఖా హివ్రాలే తెలిపారు. దర్యాప్తు సమయంలో 8 మంది సాక్ష్యులను విచారించారు. బాధితురాలు 13 ఏళ్ల బాలికతో పాటు ఆమె తల్లిని కూడా విచారించారు.
ఒకవేళ జరిమానా డబ్బు అందితే, అప్పుడు ఆ సొమ్మును బాధితురాలికి నష్టపరిహారంగా ఇవ్వాలని కోర్టును న్యాయవాది కోరారు.