Heart Attack | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన 25వ వివాహ వార్షికోత్సవ (25th anniversary) కార్యక్రమంలో భార్య ముందే అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బరేలీ (Bareilly)లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. షూ వ్యాపారి అయిన 50 ఏళ్ల వసీం సర్వత్ తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతిథులతో ఎంతో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో స్టేజ్‌పై తన భార్య ఫరాతో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే, ఆ సమయంలో వసీం స్టేజ్‌పైనే కుప్పకూలి కిందపడిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అతడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు (Heart Attack)తో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. దీంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు కాస్తా విషాదాంతమయ్యాయి. కళ్లెదుటే భర్త మరణంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వసీం స్టేజ్‌పై కుప్పకూలి పడిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Shoe merchant Wasim died suddenly while dancing with his wife on his 25th wedding anniversary in #Bareilly district of #UttarPradesh!!
It was such a happy moment. He was dancing holding his wife’s hand. Suddenly he fell on the stage. pic.twitter.com/VzOeZRMv7g
— Siraj Noorani (@sirajnoorani) April 3, 2025
Also Read..
Waqf Amendment Bill | వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. అర్ధరాత్రి దాటేవరకు చర్చ
Nithyananda | బొలీవియాలో నిత్యానంద భూ కబ్జా.. 25 ఏళ్ల లీజు అని నమ్మించి వెయ్యేళ్లకు ఒప్పందం!
Make In India | అసెంబుల్ ఇన్ ఇండియాగా మారిన మేకిన్ ఇండియా: ఫిన్‌ఫ్లూయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ