Nithyananda | న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత్ నుంచి పారిపోయి, కైలాస దేశాన్ని ఏర్పాటు చేసిన స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశ అధికారులు గత వారం తెలిపిన వివరాల ప్రకారం, అమెజాన్ కార్చిచ్చును ఆర్పడానికి సాయపడతామని స్థానిక బౌరే తెగవారిని కైలాస దేశ ప్రతినిధులు నమ్మించారు.
అందుకు ప్రతిగా తమకు భూమిని 25 సంవత్సరాలకు లీజుకు ఇవ్వాలని, సంవత్సరానికి 2 లక్షల డాలర్లు చెల్లిస్తామని తెలిపారు. కానీ పత్రాలపై 1,000 సంవత్సరాలకు లీజు అని రాయించుకుని, సంతకాలు చేయించుకున్నారు. బొలీవియా ప్రభుత్వం ఈ లీజు ఒప్పందాన్ని రద్దు చేసి, కైలాస ప్రతినిధులను వారి స్వదేశాలైన భారత్, అమెరికా, చైనాలకు పంపించివేసింది.