న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మేకిన్ ఇండియా పథకం ఘోరంగా విఫలమైందని ఫిన్ఫ్లూయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ విమర్శించారు. ప్రస్తుతం భారత్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఓలా, జొమాటో, పేటీయం వంటివి వాస్తవానికి సొంతంగా వచ్చిన ఆలోచనలు కావని, అవి ఉబర్, యెల్స్, అలీపే (చైనా) లాంటి వ్యాపారాలకు కాపీలని ఆరోపించారు.
నిజానికి మేకిన్ ఇండియా కాస్తా ఇప్పుడు అసెంబుల్ ఇన్ ఇండియాగా మారిపోయిందని అన్నారు. మంచి వ్యాపార ఆలోచనలను భారత్ మార్కెట్కు అనువుగా మార్చుకోవడం తప్పు కాదని, చైనా కూడా ఇదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తుందని, అయితే ఆ ఉత్పత్తుల గురించి అధిక ప్రచారం, మార్కెటింగ్ ఆ నవీకరణల పట్ల తప్పుడు ముద్రపడేలా చేస్తాయని ఆయన అన్నారు.