అలంపూర్: అలంపూర్ (Alampur) జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థిపై 8 ఓట్ల మెజార్టీతో శ్రీనివాసులు గెలుపొందారు. ఈ మేరకు ఎన్నికల అధికారి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. అధ్యక్షున్ని ఎన్నుకోవడానికి నిర్వహఙంచిన ఓటింగ్‌లో మొత్తం 22 మంది ఓటర్లకుగాను 21 మంది 21 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో గవ్వల శ్రీనివాసులుకు 14 ఓట్లు రాగా, సురేష్ కుమార్‌కు 6 ఓట్లు పోలయ్యాయి. 1 చెల్లని ఓటు నమోదయింది.
ఈ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గవ్వల శ్రీనివాసులు 8 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్‌గా కేవీ.తిమ్మారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరసింహ, జాయింట్ సెక్రెటరీగా కే.వేణుగోపాల స్వామి, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా ఏ.మధు, లైబ్రేరియన్‌గా వి.నాగయ్య ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. తమ గెలుపునకు సహకరించిన సహచర న్యాయవాదులకు గవ్వల శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.