IG Ramesh | మేడ్చల్, జూన్ 21 : పోలీసు వ్యవస్థకు వన్నె తెచ్చేలా విధులు నిర్వహించాలని శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు ఐజీ రమేశ్ సూచించారు. మేడ్చల్ పోలీస్ శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 82 మంది కానిస్టేబుళ్లకు శనివారం పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. కొత్తగా విధుల్లోకి వస్తున్న కానిస్టేబుళ్లు శిక్షణా సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలు, క్రమ శిక్షణను విధి నిర్వహణలో అమలు చేయాలన్నారు. నిజాయితీగా విధులు నిర్వహించి, బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
శిక్షణా కేంద్రం, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. శిక్షణతో కానిస్టేబుళ్లను తీర్చిదిద్దిన పోలీసు శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి, అధికారులు, సిబ్బందిని ఐజీ రమేశ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్ మధుకర్ స్వామి, పీటీవో రాజేష్, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి, పోలీసు అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్