Girl missing | జవహర్నగర్, జూన్ 11: తరచుగా ఫోన్ వాడొద్దని తల్లి మందలించడంతో కోపంతో తనయ ఇంటి నుంచి బయటకు వెళ్ళి అదృశ్యమైంది. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి జమ్మిగడ్డలో చోటుచేసుకుంది. ఎస్హెచ్వో సైదయ్య తెలిపిన కథనం ప్రకారం… కాప్రా మండల పరిధి జమ్మిగడ్డలోని జై జవాన్కాలనీలో కేశవ్ కదర, భార్య చంద్ర, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు.
ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులకు వివాహాలు కాగా.. చిన్న కుమార్తె లాలితో కలిసి ఉంటున్నారు. ఈ నెల 11న లాలి(20) ఇంట్లో చెప్పకుండ బయటకు వెళ్లి ఇంత వరకు తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకి కోసం చుట్టు ప్రక్కల, బంధువుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఫోన్ తరచుగా వాడొద్దని తల్లి మందలించడంతోనే లాలి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ఉండొచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.
ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు