GHMC | అల్లాపూర్, ఏప్రిల్ 23 : నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ మూసాపేట సర్కిల్ -23 టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి రమేష్ హెచ్చరించారు. గాయత్రి నగర్ ప్లాట్ నెంబర్ 371లో భవన నిర్మాణానికి మూడంతస్తులు అనుమతులు తీసుకొని.. అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించారు.
ఈ క్రమంలో టీజీబీపాస్ యాక్ట్ 2020 ప్రకారం సదరు నిర్మాణదారులకు షోకాస్ నోటీసు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు భవనాన్ని సీజ్ చేశారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు భవనానికి వేసిన సీల్‌ను సదరు నిర్మాణదారులు తొలగించి యధావిధిగా నిర్మాణం చేపట్టారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేస్తున్న సదరు భవన యజమానులపై జీహెచ్ఎంసీ అధికారులు అల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ ఎస్ సెక్షన్ 223,334(2) ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి