MLA Mallareddy | జవహర్‌నగర్, జూన్ 21: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి చిరునామాగా యోగా నిలుస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయండి ప్రశాంతవంతమైన జీవనాన్ని పొందాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ సాయిభవాని ఫంక్షన్హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హఠయోగా ఆశ్రమ గురువు శంకరాచారి ఆధ్వర్యంలో శనివారం యోగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్లారెడ్డి, వజ్రేష్‌యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో అశాంతి, అస్థిరత పెరుగుతుందని, దీనికి విరుగుడుగా యోగాతోనే శాంతి సిద్ధిస్తుందని అన్నారు. ఆధునిక కాలంలో ఉరుకుల పరుగు జీవనంతో మానవుడు ఆరోగ్యం గురించి పట్టించుకొనే తీరికే లేకుండా పోతుందని, వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఆహారపు అలవాట్లతోపాటు యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.
భవిష్యత్ తరాలకు డబ్బులను అందిచమే కాదు.. ఆరోగ్యాన్ని అందించాలని తెలిపారు. యోగాతోనే క్రమశిక్షణ అలవడుతుందని, నేను అనే భావన మనంగా మారుతుందని, మనం అనేది మానవత్వాన్ని పెంచుతుందని తెలిపారు. యోగా కేంద్రం ఏర్పాటు త్వరలోనే స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. యోగా వ్యాయాయమే కాకుండా అదొక జీవన విధానానికి మానసిక స్థిరత్వానికి దోహదపడుతుందని మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వజ్రేష్ యాదవ్, యోగా గురువు శంకరాచారి అన్నారు. అనంతరం హఠయోగా ఆశ్రమ విన్యాసకులు, ఆసనాలు వేసి ప్రతి ఒక్కరిని అబ్బురపరిచారు.
ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్ మాజీ మేయర్లు మేకల కావ్య, శాంతి, దమ్మాయిగూడ మున్సిపల్ ఛైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు వచన్‌కుమార్, గోగుల సరిత, జవహర్‌నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదయ్య, అడ్మిన్ ఎస్సై ఇద్రీస్ అలీ, మహిళ ఎస్సై మమత, జవహర్‌నగర్ మాజీ సర్పంచ్ శంకర్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, జవహర్‌నగర్ బీఆర్ఎస్పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, డీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్, రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఛైర్మన్ గణేష్ చారి, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, హఠయోగా ఆశ్రమ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్