Excise Enforcement Officers | కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల పీఎస్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమని కొందరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. అయోధ్య నగర్ చౌరస్తాలో గంజాయి తాగుతున్నారన్న సమాచారంతో యువకులపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ దాడికి పాల్పడ్డారు.
అంతటితో ఆగకుండా వారిని అడ్డుకోబోయిన అభం శుభం తెలియని చంటీ యాదవ్(21) అనే యువకుడిపై సర్జికల్ బ్లెడ్తో చెంప, చెవి, తలపై దాడి చేశారు. ఈ ఘటనలో చంటీ యాదవ్కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని అజుదా హాస్పిటల్కు తరలించారు. చంటీ యాదవ్ చెంప, చెవి, తలకు 22 కుట్లు పడ్డాయి. ఈ ఘటన నేపథ్యంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఓ వైపు ఎక్సైజ్ అధికారులు, బాధితులు పరస్పరం పిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Vijay Devarakonda | న్యూయార్క్ ఇండియా డే పరేడ్లో విజయ్ దేవరకొండ.. వీడియో
Dhoni Fan | ధోనీకి వీరాభిమాని..హెలిక్యాప్టర్ షాట్లతో అలరిస్తున్న బుడ్డోడు.. వీడియో..!
Mareesan OTT | ఓటీటీలోకి ఫహాద్ ఫాసిల్, వడివేలు కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!