Vijay Devarakonda | అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన 43వ వార్షిక ఇండియా డే పరేడ్లో యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఇండియా డే పరేడ్ ప్రతియేట జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన వేడుకలకు విజయ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. బ్లాక్ కలర్ డ్రెస్లో పరేడ్లో పాల్గొన్న విజయ్… అభిమానులను పలకరిస్తూ అభివాదం చేశారు. అనంతరం టైమ్స్ స్క్వేర్లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విజయ్ హాజరయ్యారు. నారింజ రంగు కుర్తా, తెలుపు పైజామా ధరించి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ… ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ప్రదేశంలో మన జాతీయ జెండా రెపరెపలాడటం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని అన్నారు. అలాగే, దేశానికి దూరంగా ఉన్నప్పటికీ దేశ గొప్పతనాన్ని కాపాడుతున్న ప్రవాస భారతీయుల స్ఫూర్తిని కొనియాడారు. ఇక సినిమాల విషయానికొస్తే… ఇటీవల గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్డమ్’ చిత్రంతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.
#VijayDeverakonda lights up New York City in Honour of India’s Largest Parade with his majestic presence💥💥@TheDeverakonda joins the Parade with Family ❤️ pic.twitter.com/7KNlJbyCb6
— Suresh PRO (@SureshPRO_) August 16, 2025
#VijayDeverakonda hoists the Indian National Flag at Times Square 🇮🇳
In the presence of Consulate General and FIA Chairman.@TheDeverakonda pic.twitter.com/AALWayQ9Cr— Suresh PRO (@SureshPRO_) August 16, 2025