Mareesan OTT | తమిళ హాస్యనటుడు వడివేలు(Vadivelu), మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్(Fahadh Faasil) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మారీసన్(Mareesan). ట్రావెల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు సుధీష్ శంకర్ దర్శకత్వం వహించగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ఆర్.బి. చౌదరి నిర్మించాడు. కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితార, పిఎల్ తేనప్పన్, లివింగ్స్టన్, రేణుక, శరవణ సుబ్బయ్య, కృష్ణ, హరిత, టెలిఫోన్ రాజా తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ని పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం ఆగష్టు 22 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. దయాలన్ (ఫహాద్ ఫాసిల్) ఓ తెలివైన దొంగ. అతనికి ఒకరోజు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వేలాయుధం పిళ్లై (వడివేలు) దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉందని తెలుస్తుంది. ఆ డబ్బును కొట్టేయాలని దయాలన్ పథకం వేస్తాడు. ఈ క్రమంలో, తన స్నేహితుడిని కలవడానికి వేరే ఊరికి వెళ్తున్న వేలాయుధాన్ని కలుస్తాడు. తన మాయ మాటలతో అతన్ని నమ్మించి, తన బైక్‌పైనే ప్రయాణించేలా ఒప్పిస్తాడు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? తాను అనుకున్నట్టే దయాలన్ దోచుకున్నాడా? అల్జీమర్స్ వల్ల తన జ్ఞాపకాలను కోల్పోతున్న వేలాయుధం ఏం చేశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Ellaruma sendhu Thiruvannamalai poitu varuvoma? 🤭😅 pic.twitter.com/BbOvAJQj58
— Netflix India South (@Netflix_INSouth) August 17, 2025