Dhoni Fan | ధోనీకి వీరాభిమాని..హెలిక్యాప్టర్ షాట్లతో అలరిస్తున్న బుడ్డోడు.. వీడియో..!
Dhoni Fan : సరదాగా స్నేహితులతో క్రికెట్ ఆడే పిల్లలు చాలామందే ఉంటారు. తమ అభిమాన ఆటగాళ్లను అనుకరిస్తూ వాళ్ల మాదిరిగా షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన ఓ పిల్లాడు చూడముచ్చటైన షాట్లతో నెట్టింట వైరలవుతున్నాడు. అతడి పేరు యువరాజ్ గాంధీ (Yuvraj Gandhi).
Dhoni Fan : సరదాగా స్నేహితులతో క్రికెట్ ఆడే పిల్లలు చాలామందే ఉంటారు. వాళ్లలో కొందరు మాత్రం చిన్న వయసు నుంచే ఆటను సీరియస్‌గా తీసుకుంటారు. అంతేకాదు తమ అభిమాన ఆటగాళ్లను అనుకరిస్తూ వాళ్ల మాదిరిగా షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన ఓ పిల్లాడు చూడముచ్చటైన షాట్లతో నెట్టింట వైరలవుతున్నాడు. అతడి పేరు యువరాజ్ గాంధీ (Yuvraj Gandhi). నెట్స్‌లో ఓ రేంజ్లో షాట్లు ఆడుతున్న ఈ చిన్నోడి వీడియో చూసినవాళ్లంతా ఔరా.. ఖతర్నాక్ ఆడుతున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
యువరాజ్ గాంధీ వయసు బహుశా ఐదారేళ్లు ఉంటుంది కావొచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తూ క్రికెట్ బ్యాట్ అందుకున్న ఈ బుడ్డోడు ఎంఎస్ ధోనీకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వీరాభిమాని. ఊరికే ఫ్యాన్ అని సంబురపడిపోయే రకం కాదు ఈ చిచ్చరపిడుగు.
CSK fan Yuvraj Gandhi from Ahmedabad has some smooth shots 👌
(Wait for the helicopter shot from the 8-year-old) #YourShots pic.twitter.com/WQXKRW4Csb
— ESPNcricinfo (@ESPNcricinfo) August 16, 2025
క్రికెట్ అకాడమీలో చేరిన యువరాజ్.. అచ్చం ధోనీ స్టయిల్లో స్టయిల్లో ఆడడం సాధన చేసి పట్టు సాధించాడు. నెట్స్‌లో అలవోకగా అన్నిరకాల షాట్లు కొడుతున్నాడు. కవర్ డ్రైవ్స్, స్ట్రెయిట్‌గా, ఆఫ్ సైడ్ ఇలా.. అన్ని దిశల్లో బంతిని తరలిస్తున్నాడు. మహీ భాయ్ మాదిరిగా అతడు కొట్టిన హెలిక్యాప్టర్ షాట్ అద్భుతం అని చెప్పాలి. పసి వయసులోనే తన క్రికెట్ నైపుణ్యంతో వైరలవుతున్న యువరాజ్ భవిష్యత్‌లో సూపర్ స్టార్ అవ్వాలని మనసారా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ లిటిల్ హీరో.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

