MLA Harish Rao | పోచారం, ఏప్రిల్ 20 : బీఆర్ఎస్లోకి వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మేల్యే తన్నీరు హరీష్‌రావు సమక్షంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ పోచారం మున్సిపాలిటీ కాచివాని సింగారం మాజీ సర్పంచ్ కొంతం వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. పోచారంలోని రేణుక ఎల్లమ్మ నూతన దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హరీష్‌రావు, మల్లారెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డికి హరీష్‌రావు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని హరీష్‌రావు ఇక్కడి నాయకులను, కార్యకర్తలను కోరారు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ తిరిగి బీఆర్ఎస్ వైపు చుస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బి.కొండల్‌రెడ్డి, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల బీఆర్ఎస్ అధ్యక్షులు మందాడి సురేందర్‌రెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు బద్దం మమత జగన్మోహన్రెడ్డి, మెట్టు బాల్‌రెడ్డి, నాయకులు బద్దం జగన్మోహన్రెడ్డి, బి.సత్తిరెడ్డి,డి. బిక్షపతి గౌడ్, బాల్‌రెడ్డి, కొర్రెముల మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ ధర్మారెడ్డి,నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?