Farmers | నవాబుపేట, జూన్ 14 : పంటలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు చెప్పే విషయ పరిజ్ఞానాన్ని రైతులు తెలుసుకునేందుకు మండలానికి కొత్తగా రెండు వీసీ యూనిట్లు మంజూరు అయినట్లు చించల్ పేట రైతు వేదిక స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్ బుచ్చయ్య తెలిపారు.
ఈ సందర్భంగా బుచ్చయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం రేపు సోమవారం రైతులకు ఈ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా వేయనున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని చించల్ పేట, నవాబుపేట, ఎల్లకొండ రైతు వేదికలలో రైతులకు శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఆయా క్లస్టర్లకు సంబంధించిన రైతు వేదికలలో ఆయా గ్రామాల రైతులు పాల్గొని పంటలకు సంబంధించిన శాస్త్రవేత్తల పలు సూచనలు, సలహాలను వీక్షించాలని స్పెషలాఫీసర్, తహసిల్దార్ బుచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం రైతుల కోసం నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకొని లాభం పొందాలన్నారు.
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్