Encroachments | జగద్గిరిగుట్ట, జూన్ 16 : హౌసింగ్ బోర్డు భూముల్లో అక్రమాలపై అధికారులు చర్యలకు దిగారు. రంగారెడ్డి నగర్ డివిజన్ ఏపీఎస్ బి కాలనీలోని సంస్థకు చెందిన ఖాళీ స్థలంలో కొన్నేండ్లుగా నిర్మాణ సామాగ్రి డంపింగ్, అక్రమ షెడ్లతో వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇటీవల నగరంలోని హౌసింగ్ బోర్డు స్థలాలు వేలం వేసేందుకు కార్యాచరణ ప్రారంభం అయ్యింది.
ఇటీవలే హౌసింగ్ బోర్డ్ ఉన్నతాధికారి గౌతమ్ ఐడిపిల్ చౌరస్తా సమీపంలోని 2.25 ఎకరాల స్థలాన్ని పరిశీలించి చర్యలకు ఆదేశించగా.. అప్పట్లో ఆక్రమణదారులకు నోటీసులిచ్చారు. అయినా ఖాళీ చేయకపోవడంతో చర్యలకు దిగారు. పోలీస్ బందోబస్తుతో సోమవారం షాపులు, షెడ్లను జేసీబీ యంత్రాలతో తొలగించారు.
ఇసుక, కంకర వ్యాపారులకు వాటిని వేరేచోటుకు తరలించుకోవాలని సూచించారు. ఖాళీ స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వేలానికి ఓపెన్ ప్లాట్లు సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. హౌసింగ్ బోర్డు సెక్రటరీ రాజేశం, ఈఈ అంకమరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత