Current Privatization | కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 9: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ను ప్రైవేటీకరణను నిరసిస్తూ కేపీహెచ్‌బీ కాలనీలోని కూకట్పల్లి, కొండాపూర్ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో మేడ్చల్, సైబర్ సిటీ పరిధిలోని విద్యుత్ ఉద్యోగులు, అన్ని రకాల యూనియన్లు, అసోసియేషన్లు కలసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉద్యోగులతోపాటు ప్రజలకు, రైతులకు ఎంతో నష్టం కలుగుతుందన్నారు. సామాన్య ప్రజలకు విద్యుత్ అందని వస్తువుగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
లేనిపక్షంలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘాల నేతలు జి హరికృష్ణ, రామ్మోహన్, వీరేశలింగం, రాజ మల్లేష్, కోటేశ్వరరావు, యాదయ్య, బషీర్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణి, చైతన్య తదితరులు ఉన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం