Garbage | సదాశివపేట, జూలై 8 : సదాశివపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం దుర్వాసనతో కంపుకొడుతున్నది. ఎక్కడపడితే అక్కడ కుళ్లిన వ్యర్థాలు పారబోయడంతో దుర్వాసన వెదజల్లుతుంది. చెత్తా చెదారం, ప్లాస్టిక్ పారవేయడంతో చెత్త పేరుకుపోతున్నది. మార్కెట్ యార్డు ప్రహారీ గోడ లోపల గేదెల పేడ, ఆవుల పేడ వేయడంతో మార్కెట్‌కు వచ్చే రైతులు, పాదాచారులు ముక్కున వేలేసుకునే పరిస్థితి నెలకొన్నది.
వ్యర్థాలను పారవేయడంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అలాగే మార్కెట్ యార్డు ప్రాంగణంలో చెట్లు ఏపుగా పెరగడం, పిచ్చిమొక్కలు ఎక్కువగా ఉండడంతో కొంత మంది ఇక్కడే కాలకృత్యాలు ముగిస్తున్నారు. మార్కెట్‌కు ప్రతీ రోజు వందల సంఖ్యలో రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. సివిల్ సప్లై బియ్యం గోదాం ఉండడంతో హమాలీ కార్మికులు వస్తూపోతుంటారు.
అలాగే వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అసంపూర్తిగా ఉండటంతో అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువవడంతోనే మార్కెట్‌యార్డు కంపుకంపుగా మారుతుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించాలని పలువురు కోరుతున్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు