నిజాంపేట,జూలై9 : మెదక్ జిల్లా నిజాంపేట మండల రైతులందరూ తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల ఏవో సోమలింగారెడ్డి అన్నారు. బుధవారం నిజాంపేట రైతువేదికలో ఏవో రైతులతో సమావేశం నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌తో ప్రభుత్వం ప్రతి రైతుకు 12 అంకెల నంబర్ కేటాయిస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందించనున్న పథకాలకు ఈ నెంబర్ దోహదపడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 6000 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోగా 5214 మంది ఇంకా మిగిలారని వారు కూడ భూపట్టా, పాసుబుక్, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను క్లస్టర్ల వారీగా ఉన్న ఏఈవోలకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.