Dangerous Roads | వర్గల్, జూలై 8 : వర్గల్ మండలంలోని పలు గ్రామాలను కలుపుతూ వెళ్లేరోడ్డు మార్గాలు ఇప్పుడు ప్రమాదాలకు దారులుగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయా గ్రామాలను కలుపుతూ వెళ్లే రోడ్డు మార్గాలు, జాతీయరహదారులను మరిపించేలా ఉండేవి. ఎక్కడ గుంతలు పడినా వెంటనే అధికారులు స్పందించి మరమత్తులు చేపట్టేవారు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి బాదారా బందీ లేకుండా ఉండేది.
ప్రధానరోడ్డు మార్గాలే కాదు. గ్రామాలలో గల్లీలకు వెళ్లే తొవ్వలు కూడా అద్దంలా కనబడేవి. అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న రోడ్లు బాగుచేయడానికి తట్టెడు మన్నువొయ్యాడినికి తీరిక లేకుండా పోయింది.
మండలకేంద్రంతోపాటు తున్కిమక్త, మజీద్‌పల్లి, సింగాయిపల్లి తదితర గ్రామాల్లో ప్రధానరోడ్డు మార్గం దెబ్బతిని వర్షాలు పడితే నీటిమడుగులను తలపించడమే కాదు.. గల్లీల్ల నడక ప్రయాణం నరకంగా మారుతుంది. ఆర్అండ్బీ శాఖ అధికారులు వెంటనే పట్టించుకొని సత్వరచర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతన్నారు.
కానక పొక్కల వడితే.. అంతే సంగతులు : ఎండీ బాబా (మైలారం గ్రామస్తుడు)
– శేరిపల్లి వర్గల్ ఊర్ల నడుమ ఉన్న డాంబర్రోడ్డు పొక్కలువడి పెద్ద సొరంగమయింది. శిన్నపని, పెద్దపనికి వర్గల్‌కు వర్గల్‌కు రావాలంటే ఈ తొవ్వగుండానే రావాలి. ఇక్కడ మూలమలుపు కూడా కానరాకుండా ఉంది. డాంబర్రోడ్డు మీదిభాగం మంచిగనే కన్పిస్తుంది, కింద పెద్ద సొరంగం పడింది. పెద్ద లారో, టిప్పరో లోడుతో పోయిందంటే రోడ్డుమొత్తం కూలిపోతది. ప్రమాదం జరుగకముందే సర్కారోళ్లు పట్టించుకొని సక్కగా చేయాలి.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు