Pocso Case | నేరేడ్మెట్, ఏప్రిల్ 2 : మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ నిందితుడికి శిక్ష పడింది. పోక్సో కేసులో నిందితుడికి మూడేండ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఓల్డ్ సఫిల్‌గూడకు చెందిన టాకూర్ సంజయ్ (21) పెయింటింగ్ పని చేస్తుంటాడు. అతడు 2017 సంవత్సరంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నేరానికి సంబంధించిన అన్ని సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టారు. ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న అనంతరం నేరం రుజువు కావడంతో టాకూర్ సంజయ్‌కి మూడు సంవత్సరాలు జైలు శిక్షతోపాటు రూ. 5వేల జరిమాన విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు నేరస్తుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.