CPR Awareness Programme | కుత్బుల్లాపూర్, జూలై 12 : అత్యవసర పరిస్థితుల్లో గుండె పోటు వస్తే CPR (Cardiopulmonary resuscitation)తో మనిషి ప్రాణాలు కాపాడే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రముఖ కార్డియో సర్జన్, స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా గోపీచంద్ మన్నం అన్నారు. అకాడమీ ప్రాజెక్ట్ పల్స్ అనే శక్తివంతమైన లక్ష మందికి సీపీఆర్ అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని సుచిత్ర అకాడమీలో శనివారం ప్రారంభించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సగటున సంవత్సరానికి 2 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని.. అందులో కార్డియాక్ అరెస్ట్ తీవ్రంగా ఉందని తెలిపారు. సీపీఆర్ అనే ఆయుధంతో గుండె పోటు వచ్చిన వారిని బ్రతికించే అవకాశం ఉందని అన్నారు. ఐతే మొదటగా సీపీఆర్ అనే ప్రక్రియ గురించి విద్యార్థి దశలో ఉన్నప్పుడే అవగాహన కల్పించడం ద్వారా ఆసుపత్రికి వెళ్లేలోపు వారికి గుండె కొట్టుకునే విధంగా చేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
సుచిత్ర అకాడమీ ఇప్పుడు మాల్స్, జిమ్, పాఠశాలలు గేటెడ్ కమ్యూనిటీకి ప్రాజెక్ట్ పల్స్‌ను తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తోందని, సాధారణ ప్రదేశాలను అత్యవసర పరిస్థితులలో సిద్ధంగా ఉండే హబ్‌లుగా మార్చడమే లక్ష్యమన్నారు. ఇది కేవలం ఒక పాఠశాల ప్రాజెక్ట్ కాదని, ఇది ఒక సామాజిక మిషన్. సీపీఆర్ అవగాహన సాధారణ పౌరులను ప్రాణరక్షకులుగా మార్చగలదన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్డియో సర్జన్, స్టార్ హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మశ్రీ డా గోపీచంద్ మన్నమ్ ,ఆయుష్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వ్యవస్థాపకుడు డా. రాహుల్ కట్ట, సుచిత్ర అకాడమీ ఫౌండర్ ప్రవీణ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదరుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి