తిమ్మాజిపేట : దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఆర్మీలో చేరిన జవాన్ (Army Jawan ) తన మొుదటి నెల వేతనాన్ని ఆలయానికి విరాళంగా అందజేసి ఆదర్శంగా నిలిచాడు. తిమ్మాజిపేట మండలం (Timmajipet Mandal) అప్పాజిపల్లికి చెందిన పోతిరేపల్లి సోమేశ్వర్ (Someswar) కు భారత ఆర్మీలో ఇటీవల ఉద్యోగం లభించింది.
మెుదట వేతనం గ్రామంలోని శ్రీ లక్ష్మినారసింహా స్వామికి అందిస్తానని మెుక్కిన ఆయన తనకు వేతనం రాగానే అందజేశారు. శనివారం వారాంతపు పూజలు అనంతరం ఆలయ కమిటీ కార్యదర్శి రాంచంద్రారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, అర్చకులు గంగాధర్ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, భాస్కరరెడ్డి, శంకర్ రావు, ఎల్లారెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.