శివ్వంపేట, జులై 11 : బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే గ్రామ పంచాయతీలు అబివృద్ధి చెందాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని చెన్నాపూర్ గ్రామంలో రూ.20లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని తాజా మాజీ సర్పంచ్ బోళ్ల భారతిభిక్షపతితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల ప్రజలకు మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో నాడు కేసీఆర్ తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా మార్చి అబివృద్ధి చేశారని అన్నారు.
గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పలువురు లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు రమణాగౌడ్, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్, మాజీ ఉపసర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు రాంచందర్‌గౌడ్, బోళ్ల ఆంజనేయులు, భిక్షపతిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, మర్రి మహేందర్‌రెడ్డి, నర్సింగరావు, కుంట లక్ష్మణ్, శ్రీశైలంయాదవ్, తదితరులు ఉన్నారు.