రామంతాపూర్,ఆగస్టు 29 : రామంతాపూర్ డాన్ బాస్కోస్కూల్లో అనాథ బాలలకు శుక్రవారం రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక దుస్తులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తాను అనాథ బాలలకు తోచినంత చేయూత ఇస్తున్నానన్నారు. డాన్ బాస్కోలో ఉన్న అనాథ బాలలకు ప్రతి ఒక్కరు సహాయం చేయాలన్నారు. అనాథ బాలలకు తాను ఎప్పుడు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
MLA Vivekananda | అసెంబ్లీలో ప్రభుత్వం బట్టలు విప్పేందుకు సిద్ధంగా ఉన్నాం : ఎమ్మెల్యే వివేకానంద