కన్నౌజ్: ఉత్తరప్రదేశ్(UP Man)లోని కన్నౌజ్‌లో ఓ హైవోల్టేజ్ డ్రామా చోటుచేసుకున్నది. ఓ వివాహిత వ్యక్తి తన భార్య చెల్లెలను పెళ్లి చేసుకునేందుకు ఆరాటపడ్డాడు. ఎలక్ట్రిక్ టవర్ ఎక్కి మరీ తన ప్రేమ నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన కన్నౌజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్ సక్సేనా అనే వ్యక్తి 2021లో తొలిసారి పెళ్లి చేసుకున్నాడు. అయితే అతని భార్య కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోయింది. ఈ నేపథ్యంలో అతను ఆమె సోదరిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డాడు అతను. చిన్న మరదలును పెళ్లి చేసుకోవాలని అతను తన కోరికను వ్యక్తం చేశాడు. తన భార్య రెండో సోదరిని కూడా తనకు ఇచ్చి పెళ్లి చేయాలని భీష్మించాడు.
అయితే గురువారం ఓ వింత ఘటన జరిగింది. తన భార్య సోదరిని పెళ్లి చేసుకోవాలనుకున్న కోరికను భార్యకు చెప్పాడు. ఆ ప్రతిపాదనను ఆమె వ్యతిరేకించింది. దీంతో ఎలక్ట్రిక్ టవర్ ఎక్కి తన డిమాండ్ వ్యక్తం చేశాడు. చిన్న మరదల్ని ఇచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, కుటుంబ సభ్యులు అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. సుమారు ఏడు గంటల పాటు అతన్ని వేడుకున్నారు. చిన్న మరదల్ని ఇచ్చి పెళ్లి చేస్తామని హామీ ఇవ్వడంతో అతను టవర్ దికి వచ్చాడు.
తన భార్య రెండో సోదరి కూడా తనను ప్రేమిస్తున్నట్లు సక్సేనా చెప్పాడు. ఆమెను ప్రేమిస్తున్నట్లు అతను వెల్లడించాడు.