లక్నో: సర్వే కోసం గూగుల్ మ్యాప్స్ బృందం (Google Maps Team) ఒక గ్రామానికి వెళ్లింది. అక్కడ వారు ఫొటోలు తీయడాన్ని గ్రామస్తులు అనుమానించారు. ఆ బృందాన్ని దొంగలుగా భావించి దాడి చేశారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం గూగుల్ మ్యాప్స్ బృందం బిర్హార్ గ్రామానికి వెళ్లింది. వాహనాలపై అమర్చిన పరికరాలు, కెమెరాలతో ఆ గ్రామ రోడ్లను ఆ బృందం ఫొటోలు తీసి మ్యాపింగ్ చేస్తున్నది.
కాగా, ఆ గ్రామంలో తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో ఈ బృందం చోరీల కోసం సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానించారు. గూగుల్ మ్యాప్స్ బృందాన్ని వారు చుట్టుముట్టారు. వాహనాన్ని అడ్డుకుని ప్రశ్నించారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరుగడంతో పరిస్థితి ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆ బృందాన్ని గ్రామస్తులు కొట్టారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. సర్వే బృందాన్ని, గ్రామస్తులను స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే తాము దొంగలు కాదని, గ్రామాన్ని మ్యాపింగ్ చేస్తున్నామని గూగుల్ మ్యాప్స్ బృందం స్థానికులకు వివరించారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. అయితే గ్రామస్తుల దాడిపై గూగుల్ మ్యాప్స్ బృందం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీస్ అధికారి తెలిపారు. గ్రామంలో సర్వే కోసం వారు అనుమతి పొందినట్లు వెల్లడించారు.
🚨कानपुर : महोलिया के ग्रामीणों ने गूगल मैप कर्मियों को पीटा🚨
🆔 गूगल मैप कर्मियों को चोर समझ कर की पिटाई
🕵️♂️ टच महिंद्रा कंपनी के लिए युवक करते हैं काम
📸 जीपीएस टैगिंग के साथ करते हैं फोटो अपलोड
⚠️ क्षेत्र में हो रही चोरियों से ग्रामीणों में आक्रोश
💥 चोरों की कार समझकर रोककर… pic.twitter.com/XXiStwWyiN— भारत समाचार | Bharat Samachar (@bstvlive) August 28, 2025
Also Read:
I’m your husband’s 2nd wife | నీ భర్తకు రెండో భార్యనంటూ ఫోన్.. బస్సులో కుప్పకూలి మహిళ మృతి
Woman Gives Birth To 17th Child | 55 ఏళ్ల వయస్సులో.. 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Watch: స్కూటర్ రివర్స్ చేస్తుండగా ఓపెన్ డ్రెయిన్లో పడిన దివ్యాంగుడు.. తర్వాత ఏం జరిగిందంటే?