KTR | ఘట్ కేసర్, ఏప్రిల్ 23 : వరంగల్ వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘట్ కేసర్ పట్టణంలోని ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ మహా సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వెళ్తున్న కేటీఆర్కు ఘట్ కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నోముల నవీన్ ప్రకాష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని.. అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా నేతలంతా కేటీఆర్కు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల రెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యుడు ఎండీ సిరాజ్, సీనియర్ నాయకులు కృపాకర్, అన్నూబాయ్, షకీల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి