గాంధీ సరోవర్ ప్రాజెక్టును ఆపండి
రాష్ట్ర ప్రభుత్వం మూసీపై ప్రతిపాదించిన గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిలిపివేయించాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ను మూసీ జన్ ఆందోళన్ (ఎంజేఏ) బృందం కోరింది. ఈ మేరకు ఆమెకు గురువారం లేఖ రాసినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అంశంపై జోక్యం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి వాస్తవ పరిస్థితులను వివరించాలని బృందం సభ్యులు డిమాండ్ చేశారు.
- పర్యావరణానికి ముప్పు.. ప్రజలకు నష్టం
- బాపూజీ బతికి ఉంటే ఆ పనులు వద్దనే వారు
- మీనాక్షికి మూసీ జన్ ఆందోళన్ లేఖ
- జోక్యం చేసుకొని ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపి వేయించాలని వినతి
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ ): రాష్ట్ర ప్రభుత్వం మూసీపై ప్రతిపాదించిన గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిలిపివేయించాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ను మూసీ జన్ ఆందోళన్ (ఎంజేఏ) బృందం కోరింది. ఈ మేరకు ఆమెకు గురువారం లేఖ రాసినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అంశంపై జోక్యం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి వాస్తవ పరిస్థితులను వివరించాలని బృందం సభ్యులు డిమాండ్ చేశారు.
‘నివాసాలను కూల్చి, ప్రజలను రోడ్డున పడేసి గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించడం గాంధేయవాదం అనిపించుకోదు’ అని ఎంజేఏ తప్పుబట్టింది. ‘బాపూజీ బతికి ఉంటే ‘నా పేరుతో ఇలాంటి పనులు చేయకండి’ అని వారించేవారని గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని బృందం సభ్యులు కోరారు. మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ పరిధిలో 10.34 ఎకరాల భూమిని సేకరించడం వల్ల మధుపార్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేరొన్నారు. ప్రాజెక్ట్ కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూమిని కోరడంపైనా అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ప్రజల వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ, శంకుస్థాపనకు కేంద్ర మంత్రిని ఆహ్వానించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 2013 భూసేకరణ చట్టం (సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) నుంచి ఈ ప్రాజెక్టుకు మినహాయింపు ఇవ్వడాన్ని ఎంజేఏ తీవ్రంగా ఖండించింది.
పర్యావరణానికి విఘాతం
ఈ ప్రాజెక్ట్‌తో నది పర్యావరణ వ్యవస్థ దెబ్బతిం టుందని, స్థానికులకు శాశ్వత నష్టం కలుగుతుందని మూసీ జన్ ఆందోళన్ సభ్యులు హెచ్చరించారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ముందుకెళ్లడం సహజ వారసత్వాన్ని నాశనం చేయడమేనని ఆందోళన వ్యక్తంచేశారు. మీనాక్షీనటరాజన్కు ఎంజేఏ తరఫున అఖిల్ సూర్య, జీవన్‌కుమార్, మీరా సంఘమిత్ర, సజయ కాకర్ల, సంధ్య, సయ్యద్ బిలాల్, వైశాలీ నాయుడు, ఆనంద్ తదితరులు సంతకాలు చేసిన లేఖను పంపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

