హసన్పర్తి, మార్చి 5 : హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట సమీపంలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థినుల కాళ్లపై ఎలుకలు కొరకడంతో గాయాలయ్యాయి. గురువారం ఉదయం వారిని ప్రిన్సిపాల్ ఇందుమతి హసన్పర్తి పీహెచ్సీకి తీసుకెళ్లడంతో వైద్యులు వారికి చికిత్స చేశా రు. అనంతరం వైద్యులు పాఠశాలను సందర్శించి వివరాలు తెలుకున్నారు. ఎలుకల నివారణకు ప్రిన్సిపాల్, సిబ్బంది పట్టించుకోవడం లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో ఈ ఘటనకు దారితీసిందని ఆరోపిస్తున్నారు.