మార్చిలోనే మండుటెండలు
ఈనెల మొదటివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా మండుటెండలు సెగలు పుట్టిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకుపైగా నమోదయ్యాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో అత్యంత గరిష్ఠంగా 39 డిగ్రీలు నమోదు కాగా, 21 జిల్లాల్లో 38 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది.
- 21 జిల్లాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
- భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో 39 డిగ్రీలు
- 18 తర్వాత అకాల వర్షాలు కురిసే అవకాశం
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఈనెల మొదటివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా మండుటెండలు సెగలు పుట్టిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకుపైగా నమోదయ్యాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో అత్యంత గరిష్ఠంగా 39 డిగ్రీలు నమోదు కాగా, 21 జిల్లాల్లో 38 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. రానున్న రోజుల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 39 నుంచి 41 డిగ్రీల వరకు చేరవచ్చని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు వివరించింది.
ప్రజలు మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా బయటకు రావొద్దని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గత ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. ఇదిలా ఉండగా.. రాబోయే రోజుల్లో వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకుంటాయని వెల్లడించింది. ఈ క్రమంలో 18 వరకు భానుడి భగభగలు కొనసాగి, ఆ తర్వాత అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఫిబ్రవరిలో కురిసిన వానల కంటే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతోపాటు కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. పంట కోత దశలో ఉన్న రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

