మాదిగ ద్రోహి రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి హయాంలోనే మాదిగలకు మరింత మోసం జరుగుతున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. పార్సిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో గురువారం విలేకరులతో మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో మూడు లోక్‌సభ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ కాగా, వాటిలో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకుండా అన్యాయం చేశారని గుర్తుచేశారు.
- రాజ్యసభ సీట్లలో నమ్మక ద్రోహం చేశారు: మందకృష్ణ
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 5: రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి హయాంలోనే మాదిగలకు మరింత మోసం జరుగుతున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. పార్సిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో గురువారం విలేకరులతో మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో మూడు లోక్‌సభ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ కాగా, వాటిలో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకుండా అన్యాయం చేశారని గుర్తుచేశారు.
ఇటీవల అయిదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయగా, మాలలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి ఇచ్చి మాదిగలకు మాత్రం ఇవ్వలేదని చెప్పారు. తాజాగా రాజ్యసభ సీట్లలోనూ మాదిగ జాతికి ద్రోహం చేశారని దుయ్యబట్టారు. పార్లమెంట్లో మాదిగలకు ప్రాతినిధ్యం లేని సందర్భం ఈ రేవంత్‌రెడ్డి హయాంలోనే ఎదురైందని పేర్కొన్నారు. రేవంత్ వైఖరికి నిరసనగా ఈ నెల 13న అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు నల్లజెండాలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

