హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) తో వంచిత్ బహుజన్ అగాడీ అధినేత ప్రకాష్ అంబేద్కర్ ( Prakash Ambedkar ) గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ బంజారాహిల్స్ లోని నివాసంలో కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, పార్టీ నాయకులను కేటీఆర్ పరిచయం చేశారు. భేటీ అనంతరం ప్రకాష్ అంబేద్కర్‌ను కేటీఆర్ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.