bonalu | నగరంలోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. ప్రత్యేకించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించుకున్నారు. ఆయా ప్రాంతాల్లో బోనాల సందడి ఇలా..
మల్కాజిగిరి నియోజవర్గంలో బోనాల జాతర ఘనంగా..
నేరేడ్మెట్, మల్కాజిగిరి, జూలై 20: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే ప్రముఖ హిందూ పండుగ బోనాలు మల్కాజిగిరి నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి నేరేడ్మెట్, మల్కాజిగిరిలో ప్రాంతాలు భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి. వందలాదిమంది మహిళలు సంప్రదాయ బద్దంగా అలంకరించిన బోనాలతో దేవాలయాలను దర్శించుకుని అమ్మవారికి నైవేద్యం అర్పించారు. అందులో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కట్టమైసమ్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాముయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు జెఏసి వెంకన్న, జికే హన్మంతరావు, మేకల రాముయాదవ్, చిన్నయాదవ్, ఖలీల్ , మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివగౌడ్, భాగ్యానంద్, ఉస్మాన్, శ్రీనివాస్‌గౌడ్, హేమంత్ పటేల్, వంశీ ముదిరాజ్, తులసి సురేష్, మల్లేష్ యాదవ్, సిద్దిరాములు, సతీష్, నరసింహ, మర్రి శ్రీను, బాలకృష్ణ, నరేష్, రాజశేఖర్‌రెడ్డి, సాయిగౌడ్; సుమన్‌గౌడ్, వాసు, జావేద్, నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.
కాప్రాలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు..
కాప్రా, జూలై 20- కాప్రాసర్కిల్ పరిధిలోని పలు ఆలయాల్లో ఆదివారం బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కాప్రా, ఎల్లారెడ్డిగూడ, సాయిబాబానగర్, హెచ్‌బికాలనీ, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో జరిగిన బోనాల పండుగ ఉత్సవాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.
అల్వాల్‌లో వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు..
అల్వాల్ జూలై 20: అల్వాల్ పట్టణ కేంద్రంలోని బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో బోనాలతో నైవేద్యాలు సమర్పించారు. తొట్టెలు, ఫలహార బండ్లు, ఊరేగింపు వేడుకలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో వేడుకలు సందడిగా సాగాయి. అల్వాల్ డివిజన్ ముత్యం రెడ్డి నగర్ లో అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి అమ్మవారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఓల్డ్ అల్వాల్ హరిజన బస్తిలో నల్ల పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. మచ్చ బొల్లారం డివిజన్ శివంబావి కాలనీలో మహేష్ ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఆషాడ బోనాల పండుగను ప్రజలంతా కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా చల్లగా జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్, కౌశిక్, మధు, చరణ్, లింగారెడ్డి, యాదగిరి గౌడ్, రహమత్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం డివిజన్: సుభాష్ నగర్ ఇంద్రనగర్ అంబేద్కర్ నగర్ మూర్తి నగర్ యాదమ్మ నగర్ కనజిగూడ లోని స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో పలు కాలనీలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మచ్చ బొల్లారం డివిజన్: బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నార్ల సురేష్ ఆధ్వర్యంలోడివిజన్ లోని అమ్మవారి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరంఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ బైలెల్లినాదో అంటూ సాగే ఆడపడుచుల బోనాల సమర్పణ ఉత్సవం తెలంగాణ ప్రజల భక్తి తత్పరతకు అద్దం పడుతుందని ఆషాడ మాసం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం భక్తులు తెచ్చే నైవేద్యం స్వీకరించి భక్తులకు ఏ ఆరోగ్య సమస్యలు రాకుండా అండగా ఉంటూ సుఖ సంతోషాలను మనకిస్తుందని వెల్లడించారు.
ఓల్డ్ ఆల్వాల్: శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో దుర్గ మాత నల్ల పోచమ్మ కు కాలనీవాసులు ఉదయం నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బి నాగేశ్వరరావు, సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రావు, సాయిరాం గౌడ్, నారాయణ, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
బోనమెత్తిన మేడ్చల్..
మేడ్చల్, జూలై 20 : అషాడమాసం బోనాల పండుగలో భాగంగా ఆదివారం మేడ్చల్ పట్టణంలోని మెజార్టీ ప్రజలు బోనాల పండుగ నిర్వహించారు. పట్టణంలోని వివిధ కాలనీ ప్రజలు పోచమ్మ, మైసమ్మ, నల్ల పోచమ్మ తదితర గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో సిద్ధం చేసుకున్న బోనాలను ఊరేగింపుగా వెళ్లి, సమర్పించారు. ఒడి బియ్యం, దూప, దీప, నైవేద్యాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.
బోనాల పండుగను పురస్కరించుకొని పాత పట్టణం, బాలాజీనగర్, కేఎల్ఆర్, ఏడుగుళ్లు తదితర గ్రామ దేవతల ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బోనాలను సాయంత్రం ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించగా, ఉదయం పూట ప్రత్యేక పూజలు చేశారు. కేఎల్ఆర్ నగర్లో వెలిసిన అమ్మవారి వద్ద అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ ప్రజలు అమ్మవారిని దర్శించుకొని, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
అమ్మకు బోనం.. ఘనంగా బోనాల ఉత్సవం..
ఉప్పల్, జూలై 20 : ఉప్పల్, నాచారం, రామంతపూర్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద సందడి నెలకొంది. నాచారంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేఖర్ పూజలు చేపట్టారు. చిలుకానగర్ లో కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ బోనం సమర్పించారు. హబ్సిగూడ లోని అమ్మవారి ఆలయాన్ని టిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి