Grain Purchase Centres | తుర్కయంజాల్, మే 7: వరి కోతలు ప్రారంభమయ్యే నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి సగానికిపైగా రైతులు ధాన్యం ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించాక దాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం రివాజుగా మారింది. ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చయకపోవడంతో రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి నష్టపోతున్నారు. మార్చి చివరి వారంలో వరి కోతలు ప్రారంభమవుతాయని తెలిసినా అధికారులు ఉద్ధేశపూర్వకంగానే కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం పరిధిలో ప్రభుత్వం బాచారం, బండరావిరాల,కొహెడ,గౌరెల్లిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం బాచారం,బండరావిరాలలలో మాత్రమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ముఖ్యంగా కొహెడలో కొనుగోలు కేంద్రం ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సిఉండగా అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో రైతుల ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొనుగోలు కేంద్రం తొందరగానే ప్రారంభం అవుతుంది అనుకొని రైతులు ధాన్యంతోపాటుగా కొనుగోలు కేంద్రానికి చేరుకోని ధాన్యాన్ని ఎండకు ఆరబోశారు. అయితే రైతులు కొనుగోలు కేంద్రానికి చేరుకోని నాలుగు రోజులు గడుస్తున్నా అధికారులు కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో తీవ్రమైన ఎండలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుంది ఆశించిన రైతులకు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో నిరాశే మిగిలింది. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోగా ధాన్యంతోపాటు కొనుగోలు కేంద్రం వద్ద ఉంటున్న రైతులకు కనీస సౌకర్యాలు మంచినీరు, టెంట్లను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఎండకు మాడిపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో పలువురు రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం దారుణం : వంగేటి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు

ప్రతియేటా డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా కొహెడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సరైన సమయంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడం దారుణం. ఒకవైపు ప్రభుత్వం రైతుబంధు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో సరైన సమయంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం దారుణం అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రభుత్వం కల్లాలు ఏర్పాటు చేయాల్సిండగా మే మొదటి వారం వచ్చిన కొనుగోలు కేంద్రాలు, కల్లాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ విజ్ఞతకు నిదర్శనం అన్నారు.ప్రభుత్వం తక్షణమే కొహెడలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. వ్యవసాయదారుడు లేనిది వ్యవస్థ లేదు దీనిని ప్రభుత్వం గమనించాలి.
రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నాం : కవిత, కౌలురైతు, కొహెడ

సుమారు 150 క్వింటాళ్ల ధాన్యం తీసుకోని కొనుగోలు కేంద్రానికి వచ్చాము.సరైన సమయానికి కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నాము.దానితో పాటుగా కొనుగోలు కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నాము.మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడంతో నీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే ధాన్యాన్పి అమ్ముకుంటాము.
కొనుగోలు కేంద్రం ప్రారంభం కాక ఇబ్బంది: యాదిరెడ్డి,రైతు,తొర్రూర్

అధికారులు దాన్యం కొనుగోలు కేంద్రం సరైన సమయానికి ప్రారంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము.ధాన్యంతో పాటుగా రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నాము.ప్రభుత్వం సమయానికి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రానికి చేరుకోవడం వలన అనేక ఇబ్బందులు తప్పడం లేదు.రైతులు ఎండలకు ఇబ్బందులు పడుతున్న అధికారులు మాత్రం ఇటువైపుగా సైతం చూడకపోవడం దారుణంగా ఉంది.ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం ఆంశం మా పరిధిలో లేదు : పల్లవి,మండల వ్యవసాయశాఖ అధికారి,అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం
కొహెడలో ధాన్యం కొనుగోలు కేంద్రం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు.ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించే ఆంశం మా పరిధిలో లేదు.కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నాణ్యత పర్యవేక్షణ మాత్రమే వ్యవసాయ శాఖ పరిధిలో ఉంటుంది.రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు కూడా డీసీఎంఎస్ పరిధిలో ఉంటాయి.ప్రభుత్వం సూచించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు జరగుతుందా లేదా అనేది మాత్రమే పరిశీలిస్తాము.

Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజీపీ గూండాలు..ఎమ్మెల్యే గంగుల ఆఫీస్‌పై దాడి : వీడియో
Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!