Trees cutting | తుర్కయంజాల్, సెప్టెంబర్ 13 : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడ ఎన్ఎస్ఆర్ నగర్ కాలనీ రోడ్డు నంబర్ 10లోని స్మశాన వాటికలో చెట్లను నరికిన వ్యక్తులకు మున్సిపాలిటీ అధికారులు జరిమానా విధించారు.
ఈ సందర్బంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ శానిటేషన్ అధికారి వనిత మాట్లాడుతూ.. ఎస్ మల్లయ్య అనే వ్యక్తి మూడు కానుగు చెట్లను నరికివేశారని తెలిపారు. ఈ విషయమై స్థానికులు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో తుర్కయంజాల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు నిబంధనలను అతిక్రమించి చెట్లు నరికి వాహనంలో తరలించిన వ్యక్తులకు రూ. 15000 జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!