Farmers strike | నందిగామ, జూన్ 22 : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగుర్ రెవెన్యూ పరిధిలో 2003 సంవత్సరంలో టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని చుట్టుపక్కల గ్రామాల రైతుల నుండి సుమారు 140 ఎకరాల పట్టా భూములను కొంత మంది వ్యక్తులు కొనుగోలు చేశారు. భూమి కొనుగోలు సమయంలో టెక్స్ టైల్స్ పార్క్ నిర్వాహకులు పార్కు ఏర్పాటు చేసి రైతుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మించి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు.
అయితే ఇప్పటివరకు పార్కు ఏర్పాటు చేయకుండా ఉద్యోగాలు కల్పించకుండా టెక్స్ టైల్స్ పార్క్ నిర్వాహకులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ నందిగామ మండలం చేగూరు రెవెన్యూ పరిధిలోని టెక్స్ టైల్స్ పార్కు ముందు ఆదివారం పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులు ధర్నా నిర్వహించారు. 2003 సంవత్సరంలో టెక్స్ టైల్స్ పార్క్ పేరుతో నిర్వాహకులు రైతుల నుండి సుమారు 140 ఎకరాల భూమి కొనుగోలు చేసి టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేయకుండా ఉద్యోగాలు కల్పించకుండా తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్క్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతోనే భూములు ఇచ్చామని ఉద్యోగాలు ఇవ్వకుండా భూములు అమ్ముకొనేందుకు పార్క్ నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారని, పార్క్ ఏర్పాటు చేయకుండా ఉద్యోగులు ఇవ్వకుండా భూములు అమ్ముతాం అంటే ఊరుకునేది లేదని, తమ భూములు తమకు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. తమ భూములు తమకు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేసి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశామని, ప్రభుత్వం స్పందించి రైతుల భూములు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు..
టెక్స్ టైల్స్ పార్క్ బోర్డ్ సభ్యుల ధర్నా..
చేగుర్ టెక్స్ టైల్స్ పార్క్ ముందు రైతులు ఒక వైపు టెక్స్ టైల్స్ బోర్డ్ సభ్యులు కొంత మంది ఒక వైపు ఆందోళన నిర్వహించారు. టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు కోసం 108 మందితో బోర్డ్ ఏర్పాటు చేసి.. అందరి దగ్గర డబ్బులు తీసుకొని రైతుల వద్ద భూములు కొనుగోలు చేసి పార్క్ ఏర్పాటు చేయకుండా డబ్బులు ఇచ్చిన బోర్డ్ సభ్యులకు కేటాయించిన ప్లాట్ లు ఇవ్వకుండా బోర్డ్ చైర్మన్ తమను మోసం చేశారని, ప్రభుత్వం స్పందించి తమకు కేటాయించిన ప్లాట్లు తమకు ఇస్తే పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..