Future City | ఫ్యూచర్ సిటీలో జేసీబీలతో రైతుల పంట ధ్వంసం.. వీడియో
Future City | దుక్కి దున్ని సాగు చేసి భూములను కోర్టు స్టే ఉన్నా పోలీసుల పహారాలో అధికారులు బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో లక్షలు పెట్టుబడి పెట్టి భూములు సాగు చేసుకుని రైతులు వేసిన విత్తనాలను అధికారులు జేసీబీలతో తొలగిస్తున్నారు.
Future City | వర్షాకాలం కావడంతో ఓ వైపు తమ భూముల్లో సాగు పనులు చేసుకుంటుండగా.. మరోవైపు ఫ్యూచర్ సిటీ మాయలో ఉన్న కాంగ్రెస్ సర్కార్కు అవేమి పట్టడం లేదు. రైతులు దుక్కి దున్ని సాగు చేసుకున్న భూములను కోర్టు స్టే ఉన్నా పోలీసుల పహారాలో అధికారులు బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో లక్షలు పెట్టుబడి పెట్టి భూములు సాగు చేసుకుని రైతులు వేసిన విత్తనాలను అధికారులు జేసీబీలతో తొలగిస్తున్నారు. మరోవైపు మొలకలు వచ్చిన మొక్కజొన్నపంటను చూస్తూ కూడా పట్టించుకోకుండా జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు.
కోర్టు స్టే ఉన్నా కూడా అవేమీ లెక్కచేయకుండా అధికారులు తమ భూముల్లోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారని బాధిత రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములు ఎలా లాక్కుంటుందో ఈ దృశ్యం మరోసారి కండ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
ఫ్యూచర్ సిటీలో పేదల భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో లక్షలు ఖర్చు చేసి రైతు వేసిన విత్తనాలను జేసీబీలతో తొలగిస్తున్న అధికారులు
పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం
కోర్టు స్టే ఉన్నా కూడా అధికారులు తమ… pic.twitter.com/NyOe7tlFws
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2026
Read Also :
SS Rajamouli | ఇంకా 80 రోజుల షూటింగే బాకీ.. ‘వారణాసి’పై రాజమౌళి అప్డేట్!
‘వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి’
YS Jagan | ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన..కూటమి పాలనపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

