‘వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి’
కేంద్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేసేందుకు ఉద్దేశించిన కొత్త చట్టం 'వీబీ జీ రామ్ జీ' ఉపాధి హామీ కూలీల ఉపాధిని దెబ్బతీస్తుందని, ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు.
– సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్
దమ్మపేట, జులై 01 : కేంద్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేసేందుకు ఉద్దేశించిన కొత్త చట్టం ‘వీబీ జీ రామ్ జీ’ ఉపాధి హామీ కూలీల ఉపాధిని దెబ్బతీస్తుందని, ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. బుధవారం దమ్మపేట గ్రామ పంచాయతీ ఎదుట ఉపాధి కూలీల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సర్పంచ్ పగడాల రమాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టం వల్ల పని లేని రోజుల్లో ఈ చట్టం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, అటువంటి చట్టాన్ని మోదీ ప్రభుత్వం తొలగించి పేదల నోటి కాడ బువ్వను లాగేస్తుందన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, ఉపాధి హామీ కూలీలకు రూ.600 వేతనం, 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, ఉపాధి కూలీలు మద్ది రావమ్మ, భాగ్యలక్ష్మి, నాగేశ్వరమ్మ, లక్ష్మి, మహాలక్ష్మి, ధనలక్ష్మి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

