పేద కుటుంబాలను అక్కున చేర్చుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వానలు ఉండవని, నాట్లు వేయొద్దని చెప్పాడని తెలిపారు. నాట్లు వేస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందని, బోనస్ చెల్లించాల్సి ఉంటుందని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం టీడీపీ, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల అమలుకోసం ధర్నా చేశారని, ఇప్పుడు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. యూరియా యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై మండి పడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం 40 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే, అందులో నుంచి పేదలకు రూపాయి కూడా ఉపయోగం లేదని, కేవలం పారిశ్రామికవేత్తలకు మాత్రమే కేటాయిస్తున్నారని విమర్శించారు. బాన్సువాడలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆడబిడ్డలకు రూ.150 కోట్లు అందించిన ఘనత తెలంగాణ తొలిసీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.