సూర్యాపేట, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత వానకాలంలో కరువు కళ్లకు కనిపిస్తోం ది.. అయితే ఇదేదో సహజ సిద్ధంగా వచ్చింది కాదు..కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినదేనని స్పష్టం గా అర్థమవుతోంది. బీఆర్ఎస్ పదేండ్ల పాలన లో సూర్యాపేట జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ఓ పక్క కాళేశ్వరం జలాలు.. మరో పక్కన డెడ్ స్టోరేజీ కిందకు సాగర్ జలాలు ఉన్నా నాటి పాలకులు నీటిని విడుదల చేయడంతో ఇంచు భూమి మిగలకుండా సాగైంది. కానీ ప్రస్తుత వానకాలం సీజన్లో జిల్లాలో 30 శాతం వరి నాట్లు కూడా పడకపోవడం గమనార్హం. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లనో.. అవగాహన లేమితోనో… వాకాలంలో కరువు వచ్చిందంటూ ఇటీవల మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆంధ్రా ప్రభుత్వ నీటి దోపిడీని వీడియోల రూపంలో ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించిన విషయం విదితమే. దీంతో పాటు కాళేశ్వరం పరిధిలోని మోటార్లు ఆన్ చేయవచ్చు…వాటికి ఎలాంటి సమస్య లేదంటూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా చూసిన రైతాంగం కేసీఆర్ ఉంటే ఇలా జరిగేది కాదు…మాయదారి కాంగ్రెస్ ఇంకా ఎన్ని మోసాలు చేస్తదో… ఎంత నష్టం భరించాలో అంటూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు పునరావృతం అవుతున్నాయంటూ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు.
సహజంగా ప్రకృతి కరుణించకపోతే కరువు వస్తుంది. అలాంటి కరువును సహజసిద్ధ వనరులతో జయించిన పదేండ్ల బీఆర్ఎస్ పాలనే ఇందుకు నిదర్శనం. జిల్లాకు ఓ పక్కన ఎస్ఆర్ఎస్పీ, మరో పక్క నాగార్జునసాగర్ ఆయకట్టు ఉంది. కాళేశ్వరం నిర్మాణంతో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు సస్యశ్యామలం కాగా.. తమ వాటా నీటిని హక్కుగా కొట్లాడి సాగర్ నీటిని వినియోగించడంతో 2018 నుంచి 2023 వరకు పం టలు బాగా పండాయి. సాగర్ ఆయకట్టు పరిధిలో ఆంధ్రాకు పోయే కుడి కాల్వ నిండుగా పారినా తెలంగాణ ప్రాంతానికి వచ్చే ఎడమ కాల్వకు కొద్ది పాటి నీటిని విడుదల చేయడం ఆనవాయితీ. పొట్ట దశకు వచ్చిన సమయంలో నీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు ప్రతి సంవత్సరం జరిగేవి. 2015లో ఒక్క తడి కి నీటిని విడుదల చేస్తే పంట చేతికి వస్తుందని రైతులు విన్నవించడంతో నాడు మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డి.. కేసీఆర్‌తో మాట్లాడి అప్పటికే డెడ్‌స్టోరేజీకి దిగువన ఉన్నా నేరుగా సాగర్ వద్దకు వెళ్లి నీటిని విడుదల చేయించడంతో పంట చేతికి వచ్చింది. నాటి నుంచి ప్రతి సంవత్సరం ఆ నీరు హక్కుగా విడుదలవుతూ వచ్చింది.
జిల్లా వ్యాప్తంగా 2018 నుంచి ఏటా దాదాపు 4.80 లక్షల ఎకరాల్లో వరి సాగవుతూ వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కాగా ప్రస్తుత సీజన్లో కేవలం 1.40 లక్షల ఎకరాలకు పడిపోవడం గమనార్హం. నాడు ఉమ్మడి రాష్ట్ర పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల 2014కు ముందు తక్కువ సాగు కాగా.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారశైలితో సాగు విస్తీర్ణం తగ్గింది. వానకాలం సీజన్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక కరువు వచ్చిందని చెబుతున్నప్పటికీ వాస్త వ పరిస్థితి మరోలా ఉంది. శ్రీశైలం పూర్తిగా నిండినందున నాగార్జునసాగర్‌కు ఇప్పటికే జలాలు చేరుకోవాల్సి ఉంది. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రియ శిష్యుడైన రేవంత్‌రెడ్డి గురుదక్షిణ కింద పోతిరెడ్డిపాడు నుంచి నిత్యం వేలాది క్యూసెక్కుల నీరు ఆంధ్రాకు తరలిస్తున్నా ఒక్క మాట మాట్లాడటం లేదు. దీంతో దాదాపు 1.75 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు కింద సాగు 60వేల ఎకరాలకు మిం చలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో చిన్న కుం గుబాటును చూపి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టును ఎండబెడుతున్నారు. దీంతో ఈ సీజన్లో 2.90 లక్షల ఎకరాలకు 80 వేల ఎకరాలు మాత్రమే సాగవుతుంది. ఇటీవల ఈ రెండు ప్రాజెక్టులపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కాళేశ్వరం పరిధిలోని అన్ని బ్యారేజీల వద్దకు వెళ్లి వాటి పరిస్థితిని విడమర్చి చెబుతూ మోటార్లను ఎలా ఆన్ చేయవచ్చో.. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటి దోపిడీని చూపుతూ.. తెలంగాణ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడాన్ని వీడియోలతో సహా వివరించారు. జిల్లాలో పం టలు పండకపోవడానికి కారణం సహజసిద్ధంగా వచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ సవివరంగా చెప్పారు. కొద్ది రోజులు గా సదరు వీడియోలు సో షల్ మీడియాలో ట్రెం డింగ్‌లో ఉండటంతో వాటిని చూసిన రైతులు ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. ప్రభుత్వం ఏపీ మోసాలకు లొంగకుం డా, కాళేశ్వరం పంపులన్నింటినీ ఆన్ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
కాళేశ్వరం జలాల తరలింపులో కాం గ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. దీంతో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. వాస్తవానికి కాళేశ్వరం పంపులను ఆన్ చేయవచ్చని చెబుతూ జగదీశ్‌రెడ్డి చేసిన వీడియోలను నేను కూడా చూసిన. నిజంగానే అంతా బాగుంది. కేసీఆర్ మీద కోపం ఉంటే రైతులను ఆగం చేయడం సరికాదు. ఇప్పటికైనా నీటిని పంపింగ్ చేసి రైతులను ఆదుకోవాలి.
గరిడేపల్లి, ఆగస్టు 18 : సాగర్ ఎడమ కాల్వ కింద నీరు రాక నార్లు, పంటలు ఎండిపోతున్నాయి. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయల సీమకు నీటిని తరలిస్తున్నా తెలంగాణ రైతుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు. వరు ణ యాగాల పేరుతో రైతులను తప్పుదోవ పట్టించకుండా ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడా లి. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతాం.గురువు మీద ప్రేమతో రేవంత్‌రెడ్డి రైతాంగాన్ని అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోం.