HCU Land Issue | కేశంపేట ఏప్రిల్ 01 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను విక్రయించాలనుకోవడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని బీజేపీ కేశంపేట మండల మాజీ అధ్యక్షుడు రొల్లు రఘురాం గౌడ్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం విక్రయించే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తున్న తరుణంలో కేశంపేట మండలంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా రొల్లు రఘురాం గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భూములను విక్రయించే కుట్రలకు తెరలేపిందన్నారు. ప్రజల ఆస్తులను తాకట్టుపెట్టి, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే కుట్ర జరుగుతోంది. ప్రజలు, యువకులు, మేధావి వర్గం ఏకమై భూముల విక్రయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు.
పోలీసుల అదుపులో పసుల నరసింహ యాదవ్, కంచుకోట మహేష్, కంచుకోట నర్సింలు, తట్టేపల్లి నరసింహ, లెంక పోతుల విఠల్ గౌడ్, పాలది శ్రీనివాస్ గుప్త, మల్తుమ్కర్ శివాజీ, పాండు రంగా రెడ్డి, దన్నెడి కుమార్ యాదవ్, నరేందర్ రెడ్డి, వేంకటేశ్వర జి, కుమారస్వామి గుప్త, రమేష్ గౌడ్, జెట్టూరి గోపాల్ రెడ్డి, సామ శంకర్ రెడ్డి, గోగికర్ నర్సింగ్, పగిడిపాళ కోటి, కర్నాటి వినోద్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి