గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - May 12, 2020 , 00:28:57

బీటీ రోడ్లకు రూ.13.92 కోట్లు

బీటీ రోడ్లకు రూ.13.92 కోట్లు

  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

కడ్తాల్‌: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్లకు 13.92 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు ఈరెడ్డి యాదగిరిరెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. గ్రామాలు, తండాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు. ఆమనగల్లు, తలకొండపల్లి, వెల్దండ మండలాల్లోని పలు బీటీ రోడ్లు మంజూరయ్యాయన్నారు. రూ.3.27 కోట్లతో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి నుంచి మేడిగడ్డతండా మీదుగా శంకరకొండతండా వరకు, రూ.4.38 కోట్లతో మెదక్‌పల్లి నుంచి మాదాయిపల్లి వరకు, రూ.2.63 కోట్లతో రాంపూర్‌ నుంచి జంగారెడ్డిపల్లి వరకు, రూ.3.64 కోట్లతో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి నుంచి గంగ్లోత్‌ తండా వరకు బీటీ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లను కేటాయించి, గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిరోడ్లను బీటీగా మారుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీ మోత్యానాయక్‌, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, ఎంపీటీసీ రాములుగౌడ్‌, నాయకులు సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, హన్మానాయక్‌, బుగ్గయ్యగౌడ్‌, శ్రీకాంత్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, భూనాథ్‌నాయక్‌ పాల్గొన్నారు.