సుల్తాన్ గా ఎంటర్ టైన్ చేసేందుకు వస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్లో వస్తున్న సుల్తాన్ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌ను రౌండప్ చేస్తోంది. సుల్తాన్ సినిమా నిడివి చాలా లెంగ్తీగా ఉంటుందట. తాజా అప్డేట్ ప్రకారం 2 గంటల 39 నిమిషాలు సినిమా ఉండనుందని టాక్. ప్రస్తుతం వస్తున్న సినిమాలతో పోలిస్తే ఈ నిడివి ఎక్కువే.
సుల్తాన్ ఖచ్చితంగా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని ధీమాతో ఉన్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు, జై సుల్తాన్ వీడియో సాంగ్ కు మంచి స్పందన వస్తోంది. యాక్షన్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్నఈ ప్రాజెక్టులో కార్తీ రౌడీలపై ఆధిపత్యం చెలాయించే సుల్తాన్‌గా కనిపించనుండగా..రష్మిక మందన్నా పల్లెటూరి యువతిగా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
కార్తీ ‘సుల్తాన్’ సినిమా నిడివి ఎంతో తెలుసా..?
హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే..!
నివేదా పేతురాజ్ నో కిస్ పాలసీ..!