తమిళ్ సూపర్ హిట్ ప్రాజెక్టు విక్రమ్ వేధ. ఈ మూవీ హిందీలో రీమేక్ అవుతుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్‌ఖాన్, సైఫ్ అలీఖాన్ హిందీ వెర్షన్ లో నటించాల్సి ఉంది. అయితే సెట్స్ కు వెళ్లేకంటే ముందే పలు కారణాలతో అమీర్ ఖాన్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అమీర్ స్థానంలో హృతిక్ రోషన్ ను మేకర్స్ ఫైనల్ చేసినట్టు సమాచారం. కాగా ఈ ప్రాజెక్టుకు హృతిక్ రోషన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
హృతిక్‌రోషన్ రూ.50 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సైఫ్ అలీఖాన్ తన డేట్స్ ప్రకారం రూ.12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పుష్కర్, గాయత్రి హిందీ వెర్షన్ కూడా డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ వెర్షన్ లో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన విక్రమ్ వేధ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇవి కూడా చదవండి..
పాపం పవర్ స్టార్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదట!