Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Curry Leaves | కూరల్లో కరివేపాకు కనిపించగానే.. పక్కన పడేస్తుంటారు. కానీ, అనేక ఔషధ గుణాలున్న కరివేపాకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెడుతుంది. ఆయుర్వేదంలోనూ విరివిగా ఉపయోగపడుతుంది.
Curry Leaves | కూరల్లో కరివేపాకు కనిపించగానే.. పక్కన పడేస్తుంటారు. కానీ, అనేక ఔషధ గుణాలున్న కరివేపాకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెడుతుంది. ఆయుర్వేదంలోనూ విరివిగా ఉపయోగపడుతుంది. అయితే.. అందాన్ని మెరుగుపరచడంలోనూ కరివేపాకు ముందుంటుంది. కరివేపాకు ఫేస్ ప్యాక్.. మచ్చలేని, కాంతిమంతమైన చర్మాన్ని అందిస్తుంది. కరివేపాకులో యాంటి ఆక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటి మైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలం. ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని మెరిసేలా చేయడంలోనూ సాయపడతాయి. కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు.. చర్మానికి తేమను అందిస్తాయి కూడా!
కొన్ని కరివేపాకులను నీటిలో వేసి ఉడకబెట్టాలి. చల్లారాక.. మిక్సీలో వేసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌కు తేనె కలిపి.. ముఖం, మెడ, చేతులకు ప్యాక్‌లా రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. వారంలో రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.
కరివేపాకు పేస్ట్‌లో రెండుమూడు నిమ్మరసం చుక్కలు వేసి.. ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే.. చర్మం కాంతిమంతంగా మారుతుంది.
కరివేపాకు పేస్ట్‌కు, కొద్దిగా పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకున్నా.. మచ్చలు, ముడతలు తగ్గుతాయి.
ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కరివేపాకు నీరు సాయపడుతుంది. కొన్ని కరివేపాకులను.. నీటిలో ఉడక బెట్టాలి. ఆ నీటితో ముఖాన్ని తరచూ కడుక్కోవాలి. కావాలి అనుకుంటే దీన్ని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని వల్ల రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా రోజూ కరివేపాకు నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు.
కరివేపాకు నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి ఫేస్‌ప్యాక్ వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

