గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 16, 2020 , 01:54:21

నిరాడంబరం.. పంద్రాగస్టు పండుగ

నిరాడంబరం..  పంద్రాగస్టు పండుగ

  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మువ్వన్నెల రెపరెపలు 
  • lకరోనా నేపథ్యంలో  సాదాసీదాగా వేడుకలు 
  • lకలెక్టరేట్లలో జాతీయ జెండాలు ఎగరేసిన అమాత్యులు
  • lనియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు

స్వాతంత్య్ర దినోత్సవాలు కరోనా నేపథ్యంలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాదాసీదాగా జరిగాయి. ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. చొప్పదండి, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, జడ్పీ కార్యాలయాల్లో అధ్యక్షులు పుట్ట మధూకర్‌, న్యాలకొండ అరుణ, దావ వసంత, కనుమల్ల విజయ జెండాలు ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు కొద్ది సంఖ్యలో పాల్గొని వేడుకలు నిర్వహించారు. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొని జెండాలు ఆవిష్కరించారు.              - నెట్‌వర్క్‌