గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Jun 07, 2020 , 02:15:54

ఆంధ్రా నుంచి వచ్చి అమ్మకాలు

ఆంధ్రా నుంచి వచ్చి అమ్మకాలు

వెదిరలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

నాలుగేండ్లుగా మనువడితో  కలిసి వృద్ధురాలి దందా

రామడుగు : మండలంలోని వెదిరలో శనివారం ఎలాంటి లేబుల్స్‌ లేని 126 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లతో పాటు 11 కిలోల లూజ్‌ విత్తనాలను మండల వ్యవసాయ అధికారులు, పోలీసులు పటుకున్నారు. గ్రామానికి చెందిన కుమ్మరి రాజమల్లు ఇం ట్లో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి యాస్మిన్‌కు సమా చారం అందింది. దీంతో ఉదయం 11 గంటల సమయంలో దాడి చేయగా శ్రీ పావని సీడ్స్‌ అనే పేరుతో ఉన్న నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వెంటనే పై అధికారులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన మండువ లలిత, ఆమె మనువడు జయంత్‌ చౌదరి నాలు గేండ్లుగా నకిలీ పత్తి విత్తనాలు తెచ్చి అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. సీఐ రమేశ్‌, ఏడీఏ రామారావు విత్తనాలను పరిశీలించారు. ఇప్పటికే చొప్పదండి మండ లానికి విత్తనాలు సరఫరా చేసినట్లు విచారణలో తెలిపినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన ప్యాకెట్లపై కేవలం ‘శ్రీ పావని సీడ్స్‌' అని మాత్రమే రాసి ఉందని, పూర్తి చిరునామా, పాలసీ లేబుల్‌ నంబర్‌, పత్తి రకం ఏమీ లేవన్నారు. రూ.930 ధరను ముద్రించారని, నాణ్యతా ప్రమాణాలు పరీక్షించేందుకు హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపా రు. పట్టుబడిన విత్తనాల విలువ రూ.లక్షా 40 వేలు ఉంటుందని అంచనా వేశారు. విత్తనాలను సీజ్‌ చేసి, నిందితులపై కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడిచేసిన వారిలో తహసీల్దార్‌ కోమల్‌రెడ్డి, ఎస్‌ఐ అనూష, ఏవో యా స్మిన్‌, ఆర్‌ఐ తారాదేవి, తదితరులు ఉన్నారు.