శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Jun 07, 2020 , 02:13:27

విరమణ బెనిఫిట్స్‌పై అవగాహన

విరమణ బెనిఫిట్స్‌పై అవగాహన

పోలీసులతో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ సమావేశం

సర్వీస్‌ సమస్యలపై 63017 54817 వాట్సాప్‌నంబర్‌

జ్యోతినగర్‌: ఉద్యోగ విరమణ అనంతరం పోలీసు అధికారులకు వచ్చే బెనిఫిట్స్‌పై ఎన్టీపీసీ ఈడీసీ మిలీ నియం హాల్‌లో రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని పోలీసులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ అశోక్‌కుమార్‌ మాట్లాడారు. పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం గా సేవలు అందించి ఉద్యోగ విరమణ అనంతరం బెనిఫిట్స్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బం ది పడకూడదని సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్వీస్‌ సమస్యల పరిష్కారానికి 63017 54817 వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. టీఎస్‌జీఎల్‌ఐ, జీఐఎస్‌,  భద్రతా గ్రాట్యూటీ, జీపీఎఫ్‌, ఈఎల్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, పింఛన్‌ అంశాలపై వివరించారు ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు చికిత్స చేయించుకొని రీయింబర్స్‌మెంట్‌ ద్వారా డబ్బులు తిరిగి పొందవచ్చని తెలిపారు. పోలీసులు తమ విరమణకు ఆరు నెలల ముందు పింఛన్‌ పత్రాలను పీసీవోలో అప్పగించాలని, సర్వీస్‌కు సంబంధించి సమస్యలు ఉంటే సీపీవోలో సంప్రదించాలన్నారు. లాభదాయకమైన బెనిఫిట్స్‌ను వివరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ కమాండెంట్‌ సంజీవ్‌, ఏఆర్‌ బీసీసీ సుందర్‌రావు, ఏవో ఫర్హానా, ఆర్‌ఐలు మధూకర్‌, శ్రీధర్‌, రామగుండం పోలీసు కమిషనరేట్‌ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం, స్వామి, కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు.