EC | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న భాష, అనుచితమైన పదాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి నోటీసులిచ్చింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని శుక్రవారం ఆదేశించింది. కోడ్‌కు విరుద్ధంగా ఎన్నికల సభల్లో కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ, అవమానిస్తూ రేవంత్‌రెడ్డి మాట్లాడటంపై బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డికి నోటీసులు జారీచేసింది.